: పుష్కర జలాలు జైలుకు వచ్చాయి!
గోదావరి పుష్కరాల్లో స్నానమాచరించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తూ తండోపతండాలుగా భక్తులు ఆయా క్షేత్రాలకు విచ్చేస్తున్నారు. అయితే, పుష్కర ఘాట్ వద్దకు వచ్చి పవిత్ర స్నానం చేసే అవకాశం లేకపోవడం రాజమండ్రి కేంద్ర కారాగారం ఖైదీలను నిరాశకు గురిచేసింది. దీంతో వారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించగా, ప్రభుత్వం ఖైదీలను బయటికి అనుమతించేందుకు నిరాకరించింది. అయినాగానీ, ఖైదీలకూ పుష్కర భాగ్యం కలిగింది. ఖైదీలను పుష్కర ఘాట్ల వద్దకు తీసుకెళ్లకుండా, గోదావరి జలాలనే జైలు వద్దకు తీసుకువచ్చారు. ఈ పుణ్యజలాలను సెంట్రల్ జైలుకు తీసుకువచ్చిన అహోబిలం మఠ స్వాములు వాటిని ఖైదీలపై చల్లారు.