: ఆ పాపాలు పోవాలంటే రాహుల్ పుష్కర స్నానం చేయాలి: కవిత
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఆ పాపాలు పోవాలంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుష్కర స్నానం చేయాలని సూచించారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కవిత పైవిధంగా స్పందించారు. రైతులపై రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఖమ్మంలో ఆమె ఆరోపించారు. తొలిసారైనప్పటికీ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్నామన్నారు. రేపటితో పుష్కరాలు ముగియనుండటంతో పుష్కర ఘాట్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారన్నారు.