: నాలుగు కాళ్ల పాము...శిలాజం లభ్యం


పాముకు నాలుగు కాళ్లు ఏంటని ఆశ్చర్యంగా ఉందా? నిజమే, పాముకు నాలుగు కాళ్లు ఉండేవట. బ్రెజిల్ లో దాదాపు 113 మిలియన్ సంవత్సరాల క్రిందటి కాలం నాటి పాము అవశేషాలు శిలాజం రూపంలో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. ఈ శిలాజం ఇప్పుడున్న పాములాగే ఉందని, అయితే దీనికి తల దగ్గర రెండు, తోక దగ్గర రెండు కాళ్లున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటి పాము శిలాజాన్ని గుర్తించలేదని, నాలుగు కాళ్ల పాము ఇదేనని వారు వెల్లడించారు. ఈ పాము ఇప్పటి పాములాగే పాకేదని, నాలుగు కాళ్లను ఆహారం పట్టుకునేందుకు వినియోగించుకునేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News