: రాహుల్ పర్యటనకు హాజరైన శైలజానాథ్... వదంతులకు ఫుల్ స్టాప్


ఒక్కసారిగా గుప్పుమన్న వదంతులకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ముగింపు పలికారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నప్పటికీ, అదే జిల్లాకు చెందిన శైలజానాథ్ మాత్రం హాజరుకాలేదు. దీంతో, ఆయన కావాలనే ఈ కార్యక్రమానికి డుమ్మాకొట్టారని... ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతారేమో అన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ శైలజానాథ్ రైతు భరోసా యాత్రకు హాజరయ్యారు. జిల్లాలోని కొండకమర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరై, వేదికపైన రాహుల్ పక్కనే బైఠాయించారు.

  • Loading...

More Telugu News