: పాముతో సెల్ఫీ... రూ. కోటికి ఎసరు పెట్టింది!


ఓ భయంకర విషసర్పంతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన అమెరికన్ ఆసామి చేతి చమురు వదిలింది. వివరాల్లోకి వెళితే, శాండియాగో నివాసి టాడ్ ఫ్లాసర్ అనే వ్యక్తి రాటిల్ స్నేక్ తో సెల్ఫీ దిగాలని ప్రయత్నించాడు. అది అతని భుజంపై కాటేసింది. అది విషసర్పం, క్షణాల్లో శరీరం రోజ్ కలర్ లోకి మారడం మొదలైంది. తొలుత సమీపంలోని ఆసుపత్రికి పరుగు తీసిన ఫ్లాసర్, అక్కడి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ప్రాణాలనైతే కాపాడుకున్నాడుగానీ, బిల్లు మాత్రం 1.53 లక్షల డాలర్లు (సుమారు రూ. 97.57 లక్షలు) వచ్చిందని మొత్తుకుంటున్నాడు. అంతటితో ఆగాడా అంటే... లేదు. తన నిర్వాకాన్ని మొత్తం ట్విట్టర్ లో పోస్టు చేశాడు. పూర్తి విషమెక్కిన తన చేతి ఫోటోనూ ఉంచాడు. సెల్ఫీల మోజుతో ప్రాణాపాయ ఫీట్లు చేసే యువత దీన్ని చూశాకైనా మారతారేమో!

  • Loading...

More Telugu News