: సోనియా, రాహుల్ లు తిరిగి ఇటలీ వెళ్లే సమయం వచ్చింది: బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు తిరిగి ఇటలీ వెళ్లే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఇక లలిత్ మోదీ వివాదంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో రాహుల్ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. గతంలోనూ రాహుల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సాక్షి కలకలం రేపారు.