: చెన్నైలో త్వరలో సింగపూర్ కాలేజ్
తమిళనాడు రాజధాని చెన్నైలో త్వరలో సింగపూర్ కళాశాల ఒకటి ఏర్పాటు కాబోతుంది. రూ.46 కోట్ల వ్యయంతో సింగపూర్ కు చెందిన విద్యాసంస్థ ఒకటి తమ బ్రాంచ్ ను ఇక్కడ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు చెన్నైకి చెందిన వేల్స్ (వీఈఎల్ఎస్) ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఆ దేశానికి చెందిన 'మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్'(ఎండీఐఎస్) దాదాపు 70,000 చదరపు అడుగుల ప్రాంతంలో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. మొదట్లో బిజినెస్ అండ్ మేనేజ్ మెంట్ రంగాలలో డిప్లోమా, మాస్టర్ డిగ్రీ కోర్సులను కళాశాల ఆఫర్ చేయనుంది. తరువాత ఆ కోర్సులను మరింత విస్తరించనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి కళాశాల మొదటి దశ అడ్మిషన్లు ప్రారంభంకానున్నాయి.