: 'వ్యాపమ్' పేరు మార్చి గోల తగ్గిస్తారట!
మధ్యప్రదేశ్ లో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రోజుకో తలనొప్పి తెచ్చి పెడుతున్న వ్యాపమ్ (మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణం నుంచి కాస్తంతైనా ఊరట చెందాలంటే, ఈ పేరును మార్చివేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఓ అర్డినెన్స్ ను తీసుకురావాలని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం. వ్యాపమ్ పేరు మారితే, ప్రజలు కొత్త పేరుకు అలవాటు పడి, కుంభకోణంపై కొంతైనా చర్చ ఆగుతుందని ఆయన అనుకొంటున్నారు. మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్షా మండల్ కు 'ఎంపీ ప్రవేశ్ ఏవం భారతీ పరీక్షా మండల్' అనే కొత్త పేరును పెట్టి 'వ్యాపమ్' అనే పదాన్ని ప్రజల మనసుల నుంచి తొలగించాలన్నది ఎంపీ సర్కారు ఆలోచన. పేరు మార్పుపై చర్చించేందుకు సోమవారం నాడు మధ్యప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.