: కాల్ డేటాకు మళ్లీ సమయం కోరిన టెలికాం సంస్థలు... సుప్రీం ఆదేశాల ప్రకారం ఇవ్వాల్సిందేనన్న విజయవాడ కోర్టు


టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్ డేటా వివరాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు వారం రోజుల సమయం ఇచ్చినప్పటికీ మరింత సమయం కావాలని సర్వీస్ ప్రొవైడర్లు కోరుతున్నాయి. ఈ మేరకు విజయవాడ సిిటీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రొవైడర్ల విజ్ఞప్తిని ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వరరావు వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా సమయం కావాలని ఎలా అడుగుతారని వాదించారు. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ నెల 31వ తేదీలోగా 24 నెంబర్ల సీడీఆర్ ను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు 31కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News