: ఎన్నిసార్లు గోదావరిలో మునిగినా కేసీఆర్ కు పుణ్యం రాదు: తమ్మినేని
పారిశుధ్ధ్య కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. పుష్కర స్నానాలు చేస్తున్న కేసీఆర్ కు ఎన్నిసార్లు గోదావరిలో మునిగినా పుణ్యం రాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్టకు కోట్ల రూపాయలను ఇస్తున్న కేసీఆర్... కార్మికులను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మికులను కాదని గుళ్లు గోపురాలకు కోట్లు ఖర్చు చేసినా దేవుడు సహించడని అన్నారు. రియలెస్టేట్ వ్యాపారం కోసమే యాదగిరిగుట్టకు కోట్ల రూపాయలు కేటాయించారని ఆరోపించారు.