: త్వరలోనే సామాన్యుడిని అవుతా: గవర్నర్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన పదవికి రాజీనామా చేయనున్నారా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఓ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ భావాన్నే వెల్లడిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. నిన్న జరిగిన ఇండో, గ్లోబల్ ఫార్మా సదస్సులో పాల్గొన్న ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... త్వరలోనే తాను సాధారణ పౌరుడిని కానున్నానని తెలిపారు. ఇప్పటికే నరసింహన్ వ్యవహారశైలిపై వివిధ పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, నరసింహన్ పై కేంద్ర ప్రభుత్వం సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందన్న వార్తలు మీడియాలో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే, గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తన రాజీనామాను నిర్ధారిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.