: వడ్డీ రేట్ల నియంత్రణ బాధ్యత కేంద్రం చేతుల్లోకి... ఆర్బీఐ 'వీటో' అధికారాలకు కత్తెర!


పరపతి విధాన సమీక్షల తరువాత వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ ఆర్బీఐ గవర్నర్ చేసే ప్రకటన కోసం అన్ని వర్గాల ప్రజలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎదురుచూస్తుంటారు. ఆర్బీఐ గవర్నర్ చేసే ప్రకటనతో వృద్ధి గణాంకాల అంచనాలు సైతం మారిపోతుంటాయి. అయితే, వడ్డీ రేట్ల నియంత్రణ బాధ్యతలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తోంది. రిజర్వ్ బ్యాంకు గవర్నరుకు రెపో, రివర్స్ రెపో, సీఆర్ఆర్ వంటి గణాంకాల విషయంలో 'వీటో' హక్కులు ఉంటాయి. వీటిని తొలగించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే ఓ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీని కన్సల్టెంట్లుగా నియమించుకున్న కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ప్రకటించే పరపతి విధానంపై సమీక్ష జరిపించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం ఐఎఫ్సీ (ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్) ఓ ముసాయిదాను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం పరపతిని సమీక్షించే కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులుంటారని, అందులో నలుగురు ప్రభుత్వ, ముగ్గురు రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులుంటారని పేర్కొంది. ఈ నిర్ణయాలు అమలైతే ఆర్బీఐ అధికారాలకు మరింత కత్తెర పడినట్టేనని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News