: వాహనాన్ని క్రాస్ చేస్తూ, కేశినేని బస్సు బోల్తా


మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేశినేని ట్రావెల్స్ బస్సు (KO01AA3594) బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కర్నూలులోని ఆసుపత్రులకు తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ముందు వెళుతున్న వాహనాన్ని వేగంగా క్రాస్ చేసే సమయంలో డివైడరును ఢీకొట్టిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో చంద్రశేఖర్, మంజునాథ్, నాగస్వామి, రమాకాంత్ రెడ్డి, విశాల్ రాజ్, రామన్న, భరత్ కుమార్, విష్ణుమూర్తి, ప్రత్యూష, కిరణ్ తదితరులు ఉన్నారు. ఈ ఘటనపై ట్రావెల్స్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News