: రాహుల్ గో బ్యాక్... కొడికొండ వద్ద ‘చంద్ర దండు’ నినాదాలు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనంతపురం జిల్లా సరిహద్దు కొడికొండ చెక్ పోస్ట్ వద్ద హర్షధ్వానాలతో పాటు నిరసనలు కూడా స్వాగతం పలికాయి. ‘చంద్ర దండు’ పేరిట రంగప్రవేశం చేసిన ఆందోళనకారులు ‘రాహుల్ గో బ్యాక్’ అంటూ నినదించారు. రాహుల్ యాత్రను కాంగ్రెస్ మినహా టీడీపీ, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా పోలీసుల కళ్లుగప్పిన ‘చంద్ర దండు’ కార్యకర్తలు కొడికొండ చెక్ పోస్ట్ వద్దే రాహుల్ కు నిరసన గళం వినిపించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.