: దుమ్మురేపిన ’నారా‘ వారి కంపెనీ... తొలి క్వార్టర్ లో ‘హెరిటేజ్’ ప్రాఫిట్ డబుల్!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణిల నేతృత్వంలోని హెరిటేజ్ ఫుడ్స్ దుమ్మురేపింది. తొలి త్రైమాసికంలోనే రెట్టింపు లాభాలను ఆర్జించింది. హైదరాబాదు కేంద్రంగా డెయిరీ, బేకరీ, అగ్రికల్చర్, పునర్వినియోగ ఇంధన వనరుల విభాగాల్లో శరవేగంగా దూసుకెళుతున్న హెరిటేజ్ ఫుడ్స్ నిన్న ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే కాలం ఫలితాలతో పోలిస్తే ఈ దఫా ఆ కంపెనీ లాభం రెట్టింపైంది. గతేడాది తొలి క్వార్టర్ లో కంపెనీ లాభం రూ.5.29 కోట్లు కాగా, ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో రూ.10.71 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అదే సమయంలో ఆదాయం కూడా రూ. 505.76 కోట్ల నుంచి రూ.578.45 కోట్లకు పెరిగింది. డెయిరీ, బేకరీ విభాగాల విక్రయాలు పెరగడమే రెట్టింపు లాభాలకు కారణమని ఆ కంపెనీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News