: ఢిల్లీలో కరాళ నృత్యం చేస్తున్న కాలుష్యం!
భారత్ లోని ప్రధాన నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా, రాజధాని ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందని ఓ అంతర్జాతీయ సర్వే పేర్కొంది. కాలుష్యం కారణంగా ఢిల్లీలో రోజుకు 80 మంది ప్రాణాలు విడుస్తున్నారట. ఈ వాస్తవం పాలకులకు దిగ్భ్రాంతి కలిగించేదే. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాలుష్యంపై తాము చేపట్టిన అధ్యయనాల ద్వారా చాలా విషయాలు తెలిశాయని జవదేకర్ పేర్కొన్నారు. కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు ప్రమాదకర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. అకాల మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.