: సహజీవనం సమాజం ఆమోదం పొందింది...తప్పుకాదు: సుప్రీంకోర్టు
సమాజంలో సహజీవనం ప్రజామోదం పొందిన కారణంగా దానిని తప్పుగా భావించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజాజీవనంలో ఉన్నవారి సహజీవనాన్ని బయటపెట్టడం పరువు నష్టం కిందికి వస్తుందా? అన్న దానిపై, ఆధునిక సమాజంలో సహజీవనం అందరికీ ఆమోదయోగ్యంగా మారిందని, అందువల్ల అది నేరంకాదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రజా జీవితంలో ఉన్నవారి వ్యక్తిగత జీవితంలోకి ప్రజలు తొంగి చూడకూడదని, అలా చూడడం వల్ల ప్రజలకు ఏ విధమైన ప్రయోజం ఉండదని అటార్నీ జనరల్ ముకుల్ రోహ్గతి న్యాయస్థానానికి తెలిపారు.