: ఉస్మానియా ఆసుపత్రిని వారంలోగా తరలిస్తాం: కేసీఆర్


హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిని వారంలోగా వేరే ప్రాంతానికి తరలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు నగరంలోని ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన, ఆసుపత్రి ఆవరణ, భవనంలోని ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించారు. ఆసుపత్రిలో భయానక పరిస్థితులను గమనించామని, ఆసుపత్రి భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని మీడియాతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆసుపత్రి భవనం చారిత్రక ప్రాధాన్యత కలిగినదైనప్పటికీ పేషెంట్లు, డాక్టర్లు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమని, అందుకే ఆసుపత్రిని తరలిస్తామని స్పష్టం చేశారు. దానిపై జీహెచ్ఎంసీతో చర్చిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని చారిత్రక భవనాల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ లను కలుస్తానని తెలిపారు. ఆసుపత్రి భవనం ఉన్న స్థలంలో నూతన భవనాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News