: నాకు డ్యాన్స్, నటన రెండూ ఇష్టం లేదు: సల్మాన్ ఖాన్
తనకు డ్యాన్స్, నటన రెండూ ఇష్టం లేవని ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. తనలా చెప్పగానే పిల్లలంతా ఘొల్లున నవ్వారు. 'భజరంగీ భాయ్ జాన్' సినిమా విజయవంతమైన నేపథ్యంలో సల్లూ భాయ్ పలు వర్గాల అభిమానుల అభినందనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఈ సందర్భంగా ముంబైలోని ఓ ప్లే స్కూల్ కు వెళ్లిన సల్మాన్ అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా గడిపాడు. చిన్న పిల్లలతో సరదాసరదా సంభాషణతో పాలుపంచుకున్న సల్మాన్ ను, మీకు నటన అంటే ఇష్టమా? లేక డ్యాన్స్ అంటే ఇష్టమా? అని ఓ గడుగ్గాయి ప్రశ్నించాడు. దానికి సల్లూభాయ్ రెండూ ఇష్టం లేవని అన్నాడు. దీంతో పిల్లలంతా నవ్వేశారు.