: ఎస్ఎంఎస్ కొట్టు - మద్యం పట్టు!


ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే, మీక్కావలసిన బ్రాండు మద్యం ఇంటికి వచ్చి చేరుతుంది. అదేంటి, ఏదైనా బుక్ చేసుకోవాలంటే ఆన్ లైన్ లోకి వెళ్లాలి కదా? అని అనుకుంటున్నారా? మిగతా ప్రొడక్టులకైతే అలానే చేయాలి. కానీ, లిక్కర్ కు మాత్రం ఇదే ఆన్ లైన్ దారి. ఎక్కడో కూడా కాదు... ఆంధ్రప్రదేశ్ లోనే! ఇటీవల వేలంలో లిక్కర్ షాపులను దక్కించుకున్న వారు అమ్మకాలు పెంచుకునేందుకు కనుక్కొన్న కొత్త హైటెక్ దారి ఇది. మద్యం షాపుల యజమానులు ఇప్పుడు డోర్ డెలివరీ చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వారు తమకు మద్యం కావాలంటే మండల కేంద్రంలోని షాపు నెంబరుకు ఎస్ఎంఎస్ పెడితే, సమీపంలోని బెల్టు షాపు నుంచి నిమిషాల్లో సరుకు ఇంటికి చేరుతుందట. ఇందుకోసం మద్యం షాపుల యజమానులు ద్విచక్ర వాహనాలను వాడుతూ, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, కర్ణాటక మద్యం విధానాన్ని పాటిస్తూ, వివిధ మాల్స్ లో మద్యాన్ని అమ్ముకోవడానికి ఏపీ సర్కారు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాల్స్ లో సైతం జోరుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News