: అల్ ఖైదా కంటే ఐఎస్ వెరీ డేంజరస్ అంటున్న ఎఫ్ బీఐ చీఫ్


అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) చీఫ్ జేమ్స్ కామీ ఓ భద్రతా సదస్సులో దేశానికి పొంచి ఉన్న ప్రమాదాలపై మాట్లాడారు. అల్ ఖైదా కంటే ఐఎస్ఐఎస్ తోనే అమెరికాకు అధికంగా ముప్పు ఉందని అభిప్రాయపడ్డారు. సిరియా, ఇరాక్ దేశాల్లో అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకుని బుసలు కొడుతున్న ఐఎస్ తాజాగా అమెరికాకు పెనుముప్పుగా పరిణమించిందని అన్నారు. ఈ ముష్కర సంస్థ అమెరికాలో సోషల్ మీడియా ద్వారా గణనీయ స్థాయిలో యువకులను ఆకట్టుకుంటోందని వివరించారు. ఐఎస్ పై అభిమానంతో మధ్యప్రాచ్యానికి వచ్చే బదులు స్థానికంగానే వారు దాడులకు పాల్పడాలని ఆదేశాలిస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News