: శ్రీలంకలో తమిళులు సురక్షితంగా లేరు: పోలీసు విచారణలో ఎల్టీటీఈ మద్దతుదారు
శ్రీలంక తీవ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) తిరిగి ఊపిరిపోసుకుంటోంది. ఇటీవల తమిళనాడులో పట్టుబడిన ఎల్టీటీఈ మాజీ సభ్యుడు కృష్ణకుమార్ విచారణ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించాడు. భారత్ లో తమిళులు సురక్షితంగా ఉన్నారు. శ్రీలంకలో అలా లేరని విచారణ సందర్భంగా పలుమార్లు భావోద్వేగానికి గురైన కృష్ణకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా తిరుగుతున్న కృష్ణకుమార్ మరో ఇద్దరు తమిళులను మధురై సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి పోలీసులు సైనేడ్ టాబ్లెట్లు, సైనేడ్ పొడులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శ్రీలంకకు పంపేందుకు తమ వద్ద ఉంచుకున్నట్టు వారు విచారణలో వెల్లడించారు.