: టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో ఫిక్సింగ్ భూతం... ఆఫ్ఘన్-హాంకాంగ్ మ్యాచ్ పై అనుమానాలు!


క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం మళ్లీ జడలు విప్పింది! ఐర్లాండ్ లో నిర్వహిస్తున్న టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో ఫిక్సింగ్ జరిగినట్టు ఐసీసీ అనుమానిస్తోంది. మంగళవారం డబ్లిన్ లో ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కొన్ని అసాధారణ సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తించిన ఐసీసీ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ విచారణకు ఉపక్రమించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్ లో చివరి బంతికి హాంకాంగ్ అద్భుత విజయాన్ని సాధించింది. కాగా, ఈ మ్యాచ్ లో హాంకాంగ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఫ్ఘన్ బౌలర్ మహ్మద్ నబీ అదేపనిగా ఫుల్ టాస్ లు విసరడాన్ని ఐసీసీ సందేహిస్తోంది.

  • Loading...

More Telugu News