: విశాఖలో భారీ చోరీ... బైక్ పై వచ్చి 4.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు
నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం భారీ చోరీ జరిగింది. బైక్ వచ్చిన గుర్తు తెలియిని వ్యక్తులు కళ్లు మూసి తెరిచేలోగానే 4.5 కిలోల బంగారు నగలు ఉన్న బ్యాగుతో మాయమైపోయారు. నగరంలోని తగరపువలసలో చోటుచేసుకున్న ఈ ఘటనలో అక్కడి ఓ జ్యూవెల్లరీ షాపుకు చెందిన బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. షాపును తెరిచే క్రమంలో షట్టర్ పైకి ఎత్తుతున్న యజమానిని బెదిరించిన దొంగలు అతడి చేతిలోని బ్యాగుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి దొంగల కోసం వేట ప్రారంభించారు.