: ప్రొ కబడ్డీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోనే కాక వాణిజ్య ప్రకటనల్లోనూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్న అతడు తాజాగా ప్రొ కబడ్డీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు లీగ్ నిర్వాహకులు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మరో ఆసక్తికర అంశాన్ని ప్రకటించాడు. ప్రొ కబడ్డీలో ఓ జట్టును కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు. మరి అతడి యత్నాలు ఫలిస్తాయో, లేదో చూడాలి.