: మోదీ సర్కారుపై రాహుల్ ఫైర్... అవినీతిరహిత పాలన ఇదేనా? అని నిలదీత!


నరేంద్ర మోదీ సర్కారు పాలనపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లలిత్ మోదీకి బీజేపీ నేతల సహకారంపై విపక్షాల నిరసనలతో వరుసగా మూడు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం లోక్ సభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సభ వాయిదా పడ్డ తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ చెప్పిన అవినీతిరహిత పాలన ఇదేనా? అని రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యాపం, లలిత్ గేట్ స్కాముల్లో మోదీ సర్కారు కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రజల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని నిందించారు. ప్రతిపక్షాల గొంతును అణచివేసేందుకు మోదీ యత్నిస్తున్నారని ఫైరయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలేమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News