: పుష్కరాల తొక్కిసలాటకు మాజీ ఎంపీ హర్షకుమార్, క్రైస్తవ సంఘాలే కారణం: శ్రీరామ్ సేన
గోదావరి పుష్కరాలు ప్రారంభమైన రోజున రాజమండ్రిలోని పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై శ్రీరామ్ సేన స్పందించింది. పుష్కరాలను విఫలం చేసేందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ తో పాటు, క్రైస్తవ సంఘాలు కుట్రపన్నాయని శ్రీరామ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్ ఆరోపించారు. హర్షకుమార్ చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసినందుకు క్రైస్తవ సంఘాలు కక్షగట్టాయని... అందులో భాగంగానే కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్ చెప్పారు. ఈ పుకార్ల వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని అన్నారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కూడా తమకు అనుమానాలున్నాయని తెలిపారు.