: పుష్కరాలు, టీటీడీ సమావేశాలకు వెళ్లేందుకు సండ్రకు కోర్టు గ్రీన్ సిగ్నల్!


ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ కోర్టులో కాస్తంత ఊరట లభించింది. గోదావరి పుష్కరాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న సండ్ర పిటీషన్ పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ఆయనకు అనుమతి మంజూరు చేసింది. గోదావరి పుష్కరాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సమావేశాలకు హాజరయ్యేందుకు సండ్రకు అనుమతి మంజూరు చేస్తూ కోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది. పుష్కరాలకు సండ్ర వెళతానంటే తమకేమీ అభ్యంతరం లేదని ఏసీబీ అధికారులు చెప్పడంతో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News