: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఉమ్మారెడ్డి
ఏపీ శాసనమండలి సభ్యుడిగా వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. గుంటూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఉమ్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు. అనంతరం, ఉమ్మారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైకాపా అధినేత జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసమస్యలను సభలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.