: కరీంనగర్ జిల్లాలో చిన్నారి ప్రాణం తీసిన గోడకుర్చీ!


కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న అశ్విత అనే ఓ చిన్నారిని టీచర్ గోడకుర్చీ వేయించడంతో తట్టుకోలేక మరణించింది. దాంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. మరోవైపు బంధువులు ఆగ్రహంతో సదరు పాఠశాలలో ఫర్నీచర్ ను ధ్వంసం చేసి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... అశ్విత హుజూరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది. కొన్నిరోజుల నుంచి హోంవర్క్ చేయడంలో చిన్నారి అలసత్వం వహిస్తోందన్న కారణంగా లెక్కల టీచర్ గోడకుర్చీ వేయిస్తోంది. ఇలా వారం రోజుల నుంచి జరుగుతోంది. విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసినా... 'ఆ ఏముందిలే' అని వదిలేశారు. అయితే ఇవ్వాళ కూడా స్కూల్లో అశ్వితను టీచర్ గోడకుర్చీ వేయించడంతో తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. తరువాత చూసిన కొంతమంది టీచర్లకు చెప్పడంతో, ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంతజరిగినా ఘటనపై ఇంతవరకు స్కూల్ యాజమాన్యం స్పందించలేదు.

  • Loading...

More Telugu News