: ఢిల్లీ ఆధిపత్య పోరులో మరో అధికారిణి బలి!


ఢిల్లీలో అధికార కేజ్రీవాల్ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య అధికారం కోసం జరుగుతున్న యుద్ధంలో మరో అధికారిణి బలయ్యారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ గా స్వాతీ మలివాల్ అనే అధికారిణిని నియమించగా, ఆమెను విధుల్లోకి రానీయకుండా జంగ్ అడ్డుకున్నారు. మలివాల్ నియామకాన్ని తిరస్కరిస్తున్నట్టు జంగ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. "ఏ ఫైల్స్ పైనా నన్ను సంతకం పెట్టవద్దని ఆదేశించారు" అని స్వాతీ మలివాల్ తెలిపారు. "నా కార్యాలయానికి తాళం వేశారు. నా నేమ్ బోర్డు పీకేశారు. ఆఫీసుకు వెళ్లడం లేదు. అయినా వెనక్కు తగ్గేది లేదు. నేనిక్కడ పనిచేసేందుకు ఉన్నాను. పై అధికారులను అడుక్కోవడానికి కాదు" అని స్వాతి అన్నారు. తాను నజీబ్ జంగ్ ను కలిసేందుకు మూడు రోజులుగా వేచి చూస్తున్నానని, అయినా అపాయింటుమెంట్ దొరకడం లేదని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News