: కారులో వెళుతున్న వారికి స్వైప్ మిషన్ చూపి, షాక్ ఇచ్చిన యాచకుడు
'మీరు ఎంత ధర్మం చేస్తారో స్వైప్ చేయండి'... కొంతకాలం క్రితం సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్ లో హల్ చల్ చేసిన యానిమేషన్ వీడియో మీరు చూసే వుంటారు. అమ్మాయిలకు లైనేస్తూ, తన వద్దకు వచ్చిన యాచకుడికి, క్రెడిట్, డెబిట్ కార్డులు మాత్రమే ఉన్నాయని చూపుతూ పోజుకొట్టిన యువకుడి పరువు తీసేలా, స్వైప్ మిషన్ తీసి చూపించడం ఎంతో హ్యూమర్ ను పండించింది. అచ్చు అటువంటి ఘటనే హైదరాబాద్, హైటెక్ సిటీ సమీపంలో జరిగింది. ఇక్కడి సిగ్నల్ వద్ద ఆగివున్న కారు వద్దకు వెళ్లిన ఓ బిక్షగాడు ధర్మం చేయాలని అడిగాడు. కారులోని మహిళ తన పర్సు చూసి చిల్లర లేదని చెప్పడంతో, సదురు యాచకుడు తన వద్ద ఉన్న స్వైపింగ్ మిషన్ చూపడంతో కారులోని వారంతా అవాక్కయ్యారు. యాచకుడు స్వైప్ మిషన్ పట్టుకున్న చిత్రాలను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. హైటెక్ యుగంలో మిగతా వర్గాల మాటెలా ఉన్నా యాచకులకు స్వైప్ మిషన్లు అందుబాటులోకి వచ్చేశాయని చర్చించుకుంటూ వెళ్లిపోయారు.