: కంగారు ఎలా తగ్గుతుందంటే..!


పొద్దున లేస్తే క్షణం తీరికలేని పని. పురుషులైనా, స్త్రీలైనా రోజువారీ పనుల్లో బిజీగా ఉండిపోయి, ఒక్కోసారి ఎంతో కంగారు పడుతుంటారు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి కూడా వస్తుంది. ఎంతోమందికి ఎదురయ్యే సమస్యే ఇది. దీన్నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు... * కంగారు పడుతున్నామని అనిపించినప్పుడు చేస్తున్న పనులను కాసేపు పక్కన పెట్టాలి. ఓ ఐదు నిమిషాలు విశ్రాంతిగా కూర్చోవాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, ధ్యానం చేయడం వంటివి చేయాలి. ఓ కప్పు టీ తాగితే కూడా ఎంతో రిలాక్స్ అనిపిస్తుంది. * పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో కాలరీలు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి. * పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల రోజు ఉత్సాహంగా గడవడంతో పాటు కంగారు పుట్టదు. ఎదురయ్యే ఇబ్బంధులను తట్టుకునే శక్తి కూడా సులువుగా లభిస్తుంది. * ఇటీవలి కాలంలో అందివచ్చిన సాంకేతికత సైతం కంగారు పుట్టిస్తోంది. సమయం గురించి పట్టించుకోకుండా నెట్లో మునిగిపోయి, టైం తినేసేవారి సంఖ్య అధికమైపోయింది. ఫేస్ బుక్, వాట్స్ యాప్ వంటి వాటిల్లో మునిగిపోకుండా చేయాల్సిన పనిని సకాలంలో పూర్తి చేస్తే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. * వేళకు అనుకున్న పని పూర్తి కావాలంటే, స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టడమే ఉత్తమం. తప్పనిసరైతేనే ఫోన్ ను చేతిలోకి తీసుకోవాలి. మిగతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విషయంలోనూ ఇదే విధానాన్ని పాటిస్తే కంగారు పుట్టే ప్రశ్నే తలెత్తదు.

  • Loading...

More Telugu News