: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రైవేట్ వాటాలపై లోకాయుక్తలో మహిళ ఫిర్యాదు


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రైవేట్ వాటాలపై ఓ మహిళ భగ్గుమంది. రాజధాని నిర్మాణం పేరిట విదేశీ సంస్థలకు వాటాలను కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని ఆ మహిళ ఏకంగా లోకాయుక్తను ఆశ్రయించింది. వివరాల్లోకెళితే... హైదరాబాదుకు చెందిన న్యాయవాది ఎస్. రాజ్ కుమార్ సతీమణి సీతాలక్ష్మి నిన్న లోకాయుక్తలో ఓ పిటీషన్ దాఖలు చేసింది. కేపిటల్ డెవలప్ మెంట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ పేరిట కంపెనీని ఏర్పాటు చేసి షేర్లను విదేశీయులకు అమ్మడం సబబు కాదని సీతాలక్ష్మి ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కంపెనీలో షేర్లు దక్కించుకున్న విదేశీ కంపెనీకే రాజధానిలో పన్ను వసూలు అధికారం ఉంటుందని, ఇది దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమేనని ఆమె వాదించారు. తన పిటీషన్ లో ఏపీ ఐఏఎస్ అధికారులు గిరిధర్, శ్యామ్ బాబు బుస్సి, శ్రీకాంత్ లను ఆమె ప్రతివాదులుగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News