: నాకు సెల్యూట్ చేయవా?... ఐపీఎస్ అధికారిపై ఊగిపోయిన హోంమంత్రి
తనకు సెల్యూట్ చేయని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిపై కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలకు కోపం వచ్చింది. ఎందుకు సెల్యూట్ చేయలేదని ప్రశ్నిస్తూ, సదరు అధికారి రిషిరాజ్ కు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నెల 11న త్రిశూర్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీసుల పరేడ్ కు హోం మంత్రి హాజరుకాగా, 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిషిరాజ్ సింగ్ సైతం వచ్చాడు. హోం మంత్రి రాగానే ఇతర పోలీసు అధికారులు ఆయనకు వందనం చేశారు. రిషిరాజ్ మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. దీంతో తనకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయిన రమేష్, తన కార్యాలయం ద్వారా నోటీసులు పంపారు.