: తెలంగాణ తొలి క్వార్టర్ ఖర్చు రూ.31,872 కోట్లు... ఆదాయం రూ.25,970 కోట్లేనట!
తెలంగాణ ఆదాయ, వ్యయాల మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఈ తేడా కొట్టొచ్చినట్లు కనబడింది. మున్ముందు ఈ అంతరం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ, వ్యయాలకు పొంతన కుదరని నేపథ్యంలోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని తేలింది. ఇక లెక్కల్లోకి వెళితే... రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 25,970 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అయితే అదే సమయంలో ప్రభుత్వ వ్యయం రూ.31,872 కోట్లుగా తేలింది. దీంతో ఆర్థిక లోటు రూ.5,902 కోట్లుగా లెక్కతేలింది. ఈ నేపథ్యంలో ఆదాయం తగ్గడం, ఖర్చు పెరగడానికి గల కారణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.