: ఆ ఏర్పాట్లన్నీ బోయపాటి శ్రీను చూసుకుంటారు: మురళీమోహన్


రాజమండ్రి వద్ద పుష్కరాల ముగింపు వేడుకలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షిస్తారని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ తెలిపారు. కొవ్వూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బోయపాటి శ్రీను గురువారం ఉదయం వస్తారని, పుష్కరాల హారతి, ముగింపు వేడుకలు తదితర కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ నెల 25తో పుష్కరాలు ముగియనుండగా, ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కాగా, పుష్కరాల్లో శ్రమించిన వారిని సీఎం సత్కరిస్తారని తెలిపారు. తొలినాడు చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు తానే బాధ్యత వహిస్తానని చంద్రబాబు చెప్పారని మురళీమోహన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కంట కన్నీరు ఆ రోజు చూశానని చెప్పారు. ఏమైనా అదో దురదృష్టకరమైన సంఘటన అని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News