: గిన్నిస్ రికార్డుల కెక్కిన 'బాహుబలి'


'బాహుబలి' బాక్సాఫీస్ రికార్డులనే కాకుండా గిన్నిస్ రికార్డులను కూడా సొంతం చేసుకుంటోంది. 'బాహుబలి' సినిమా విడుదలకు ముందు కేరళలోని కొచ్చిలో ఆడియో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోబల్ యునైటెడ్ మీడియా కంపెనీ ఓ పోస్టర్ ను రూపొందించింది. ఈ పోస్టర్ ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టర్ గా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మేరకు గిన్నిస్ రికార్డుల సంస్థ ప్రకటన విడుదల చేసింది. 4,793.65 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఇంతకు ముందు ఉన్న పెద్ద పోస్టర్ రికార్డును 'బాహుబలి' తుడిచిపెట్టేసింది.

  • Loading...

More Telugu News