: వోగ్ బ్యూటీ అవార్డ్స్ ఫంక్షన్లో అందరి చూపు వీళ్లపైనే!


టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజాగా ఓ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ ప్రేమ పక్షులు ఓ హై-ఫై కార్యక్రమానికి జంటగా రావడం ఇదే తొలిసారి. ముంబయిలో జరిగిన వోగ్ బ్యూటీ అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన కోహ్లీ, అనుష్క జోడీ అందరి చూపులను తమ వైపుకు తిప్పుకుంది. గౌరి అండ్ నయనిక డిజైనర్ డ్రెస్ లో అనుష్క కనువిందు చేయగా, సూట్ ధరించి వచ్చిన కోహ్లీ మ్యాన్లీ లుక్ తో అదరగొట్టాడు. వరల్డ్ ఫ్యాషన్ డిజైనర్లు, టాప్ మోడళ్లు కూడా ఈ యువ జంటను ఆసక్తికరంగా గమనించారట. ముఖ్యంగా, వీరి డ్రెస్సింగ్ స్టయిల్ కు పలువురు ఫ్యాషన్ ఐకాన్స్ ఫిదా అయిపోయారట.

  • Loading...

More Telugu News