: ఐఎస్ రిక్రూటర్ ను అరెస్టు చేసిన స్పెయిన్ పోలీసులు


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో యువతను చేర్చుకుంటున్న వ్యక్తిని స్పెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. స్పెయిన్ లోని మెలిల్లా ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల వ్యక్తి స్థానిక మహిళలు, బాలికల్ని మభ్యపెట్టి సిరియా, ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ సంస్థలోకి పంపుతున్నాడని స్పెయిన్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంచితే, తన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ, యువతులు, మహిళల్ని ఐఎస్ఐఎస్ లో చేరుస్తున్న ఓ మహిళను కేనరీ దీవుల్లో జూలై 7న అరెస్టు చేశారు. కాగా, ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇప్పటివరకు స్పెయిన్ లో 49 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News