: ఆరేళ్లలో 228 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మహత్య
గత ఆరు సంవత్సరాలలో 228 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. కొంతమంది జవాన్లు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడితే, ఇతరులు అనారోగ్యం, వివాహ సమస్యలు, వ్యక్తిగత విరోధాలు తదితర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. వీటిని నివారించేందుకు యోగానే బెటర్ అని భావించిన కేంద్రం... పారామిలటరీ బలగాలకు యోగాను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. యోగాతో జవాన్లు శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారని కేంద్రం తెలిపింది.