: రైతులకు 'బజరంగి భాయ్ జాన్' కానుక!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగి భాయ్ జాన్' చిత్ర నిర్మాతలు తమవంతుగా రైతులకు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల నుంచి కొంత మొత్తాన్ని రైతులకు ఇవ్వాలనుకుంటున్నారని మహారాష్ట్ర బీజేపీ మహిళా నేత ఎన్ సీ షైనా వెల్లడించారు. దర్శకుడు కబీర్ ఖాన్, సల్మాన్ సోదరి అల్విరా ఖాన్, షైనాలు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సేను కలసి ఈ సినిమా వీక్షించాలని కోరారు. అనంతరం షైనా పైవిషయాన్ని మీడియాకు తెలిపారు. కాగా ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.151.05 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.