: మెమన్ కు ఉరి నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రత: సీపీ మహేందర్ రెడ్డి


ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమన్ కు ఈ నెల 30న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రత చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనే ఈ భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే ఉగ్రదాడులకు సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు రాలేదని సీపీ వివరించారు.

  • Loading...

More Telugu News