: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్, ఫోర్జరీ కేసు


కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్ రెడ్డిపై హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. నగరంలోని ఓ ఎన్ఆర్ఐకు చెందిన రెసిడెన్షియల్ ప్లాట్ ను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. దోమల్ గూడలోని తన 798 స్క్వేర్ యార్డ్ ప్లాట్ కు చెందిన అగ్రిమెంట్ పత్రాలను ఫోర్జరీ చేసి, ప్లాట్ ను మాజీ ఎమ్మెల్యే, అతని ఇద్దరి సహచరులు ఆక్రమించుకున్నారంటూ అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ కార్వడే పోస్టు ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగానే కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News