: 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అన్న దాశరథి మాటలు నేటికీ సజీవం: చంద్రబాబు
ప్రముఖ రచయిత, కవి దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ దాశరథి అని కొనియాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి వ్యాఖ్యలు నేటికీ సజీవంగానే మిగిలి ఉన్నాయని చెప్పారు. నిజాంల దారుణ పాలన, రజాకార్ల అరాచకాలను దాశరథి తన కవిత్వంలో దుయ్యబట్టారని ట్విట్టర్ లో వెల్లడించారు.