: 'నాకిదే తొలి పుష్కరస్నానం' అంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి


తాను పుట్టిన తరువాత నాలుగు సార్లు గోదావరి పుష్కరాలు వచ్చినప్పటికీ, ఇంతవరకూ ఒక్కసారి కూడా స్నానం చేయలేదని చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. తన జీవితంలో తొలిసారిగా పుష్కర స్నానం చేస్తున్నానని ఈ ఉదయం నిజామాబాద్ జిల్లా, నవీపేట మండల పరిధిలోని తుంగిని పుష్కర ఘాట్ కు వచ్చిన ఆయన మీడియాకు తెలిపారు. సన్నిహితులతో కలసి ఘాట్ కు వచ్చిన ఆయన గోదావరి నదీమతల్లికి ప్రత్యేక పూజలు చేసి స్నానం చేశారు. అక్కడి పురోహితులు దామోదర రాజనర్సింహతో పూజలు చేయించారు.

  • Loading...

More Telugu News