: రాజమండ్రి తొక్కిసలాట మృతులకు ఏపీ క్యాబినెట్ సంతాపం
రాజమండ్రి పుష్కరాల తొలిరోజు చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారికి ఏపీ మంత్రివర్గం సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు చేసిన సంతాప తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. అనంతరం పుష్కరాల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు. మరికొన్ని కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాజమండ్రిలో భేటీ కొనసాగుతోంది.