: తలసాని రాజీనామాపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటానని స్పీకర్ చెప్పారు: టీటీడీపీ నేతలు


తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. అనంతరం, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ, మంత్రి తలసాని ఇచ్చిన రాజీనామా లేఖ తనవద్ద ఉందని స్పీకర్ చెప్పారని అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో తలసాని రాజీనామాపై చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. స్పీకర్ నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని... ఇక, ఏమాత్రం జాప్యం లేకుండా తలసానిపై చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ ను కోరుతున్నామని చెప్పారు. వాస్తవానికి స్పీకర్ నివాసం ముందు మరింత తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నామని... కానీ, స్పీకర్ ఇచ్చిన సమాధానంతో తృప్తి చెంది, ఆ నిర్ణయాన్ని విరమించుకుంటున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News