: నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య వెనుక అసలు కారణమిదే!


చిన్న చిన్న ర్యాగింగ్ కారణాలతో మనస్తాపానికి గురై, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుందని భావిస్తూ వచ్చిన పోలీసులకు, అసలు నిజాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. రిషికేశ్వరిని అర్ధనగ్నంగా హాస్టల్ లో తిప్పి దాన్ని వీడియో తీసి, సీనియర్ విద్యార్థుల సెల్ ఫోన్లకు పంపినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్శిటీకి వచ్చి విచారణ జరిపిన తరువాత దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు రిషికేశ్వరి డైరీని చదవగా కళ్లు చెదిరే నిజాలు బహిర్గతమయ్యాయని తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు రిషికేశ్వరిని బలవంతంగా ఓ సినిమాకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సీనియర్ విద్యార్థిని ఒకరు వేధించగా ఆమె మధ్యలోనే వెనక్కు వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. ఆపై హాస్టలులో పెద్ద తతంగమే నడిచింది. సీనియర్లకు 'సహకరించనందుకు' శిక్షగా ఆమెను అర్ధనగ్నంగా తిప్పిన హాస్టల్ విద్యార్థినులు, దాన్ని వీడియో తీశారు. "ఆ అమ్మాయికి శిక్ష వేశాము, చూడండి" అంటూ, దీన్ని ఆ అబ్బాయిలకు పంపగా, వారి నుంచి మరింత మంది సెల్ ఫోన్లలోకి వీడియో చేరిపోయిందని పోలీసులు గమనించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న తరువాతనే రిషికేశ్వరి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరు విద్యార్థుల పాత్ర కూడా ఉందని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు.

  • Loading...

More Telugu News