: తలసానిని తప్పించండి... టి.స్పీకర్ నివాసం ముందు టీటీడీపీ ఆందోళన
టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై చర్యలకు తెలంగాణ టీడీపీ నేతలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. బర్తరఫ్ చేయాలంటూ నిన్న గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేసిన నేతలు, రాజ్ భవన్ ముందు నిరసన కూడా చేపట్టారు. ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి నివాసం ముందు ఆందోళన నిర్వహించారు. అంతకు ముందు స్పీకర్ ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్తత ఏర్పడడంతో నేతలు అక్కడే బైఠాయించారు. తలసాని రాజీనామా చేసి ఆరు నెలలవుతున్నా స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. తలసాని రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు.